'కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు' | kcr causes for telangana farmers troubles says congress leaders | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు'

Oct 9 2014 6:22 PM | Updated on Sep 2 2017 2:35 PM

'కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు'

'కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కష్టాలు'

రైతాంగ సమస్యలపై అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు.

నిజామాబాద్: రైతాంగ సమస్యలపై అసెంబ్లీ, శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీ. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గురువారం భరోసాయాత్ర నిర్వహించారు. కరెంట్ కష్టాలతో పంటలు ఎండిపోయిన రైతులను వారు పరామర్శించారు.

కేసీఆర్ అసమర్థత వల్లే రైతులకు కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. రుణాలు మాఫీకాక అప్పులు పెరిగిపోవడంతో 220 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కరువు మండలాలు ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కోల్పోయిన పంటబీమా నష్టాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement