రైతు ఆత్మహత్యలపై జస్టిస్‌ చంద్రకుమార్‌ దీక్ష | Justice Chandrakumar's initiative on farm suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై జస్టిస్‌ చంద్రకుమార్‌ దీక్ష

Nov 10 2017 3:29 AM | Updated on Sep 29 2018 7:10 PM

Justice Chandrakumar's initiative on farm suicide - Sakshi

హైదరాబాద్‌: రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. గురు వారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్‌ చంద్ర కుమార్‌ ‘రైతు రక్షణ దీక్ష’ను చేపట్టారు. ఈ దీక్షకు పలు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లా డుతూ అందరికీ ఆహారాన్ని అందించే తల్లిలాంటి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏ రంగం మూతపడ్డా నష్టం జరగదని, కానీ వ్యవసాయ రంగం మూత పడితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రైతులను మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వడ్డీ అంటే అది ముగిసిన ముచ్చట అని సీఎం అంటున్నారని, మరి రైతాంగాన్ని కాపాడటానికి ఏమి భరోసా ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల జీతాలు పెంచారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల జీతాలను విపరీతంగా పెంచారు.. మరి రైతుల పంటకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మార్కెట్‌లో కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించడం లేదన్నారు. కార్యక్రమంలో  ఏఐకే ఎంఎస్‌ నాయకుడు కెచ్చల రంగయ్య, రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్, అఖిల భారత రైతు కూలీ సంఘం నేత అచ్యుత రామారావు, రైతు స్వరాజ్య వేదిక నాయ కులు కొండల్, ఏఐకేఎఫ్‌ నాయకులు ప్రభులింగం, మన్నారం నాగరాజు, మాజీ ఎంపీ సోలిపేట రాంచంద్రా రెడ్డి, ప్రొఫెసర్లు అరిబండి ప్రసాద రావు, లక్ష్మణ్, పీఎల్‌ విశ్వేశ్వర్‌ రావు, చంద్రన్న తదితరులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య రాత్రి 7 గంటలకు జస్టిస్‌ చంద్రకుమార్‌ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement