ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..

Jayesh Ranjan Nomination Rejected In Olympic Association President Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మాజీ ఎంపీ బీజేపీనేత జితేందర్‌రెడ్డి నామినేషన్లు అనూహ్యంగా తిరస్కరించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ముగ్గురు నామినేషనన్లు వేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు.

గతంలో ఒలంపిక్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ తెలంగాణకు నాయకత్వం వహించిన కె. రంగారావు నామినేషన్‌ను స్వీకరించగా.. జయేష్‌ రంజన్‌ క్యాట్‌ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామినేషన్‌ను రిజెక్టు చేశారు. దీనిపై జయేష్‌ రంజన్‌, జితేందర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికలు కాస్త రాజకీయనాయుడికి, ప్రభుత్వ అధికారికి మధ్య పోటీగా మారనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top