బాబు దబాయింపులకు భయపడం: హరీశ్‌రావు | Irrigation Minister Harish Rao Fires at AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు దబాయింపులకు భయపడం: హరీశ్‌రావు

Jun 30 2015 3:22 AM | Updated on Aug 18 2018 6:05 PM

బాబు దబాయింపులకు భయపడం: హరీశ్‌రావు - Sakshi

బాబు దబాయింపులకు భయపడం: హరీశ్‌రావు

ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు సెక్షన్ 8 అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసే దబాయిం పులకు భయపడేదిలేదని

సాక్షి, సంగారెడ్డి: ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు సెక్షన్ 8 అం టూ ఏపీ సీఎం చంద్రబాబు  చేసే దబాయిం పులకు భయపడేదిలేదని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటామన్నా, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలంటున్నా.. తెలంగాణ టీడీపీ నేతలు రమణ, ఎర్రబెల్లి ఎందుకు నోరుమెదపటం లేదని ప్రశ్నించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌పై చం ద్రబాబు ఆటలు సాగనివ్వబోమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10 వేల కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలి పారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement