చెల్లని ‘షాదీ’ చెక్కులు

Invalid cheques to Shadi Mubarak - Sakshi

తిరస్కరించిన బ్యాంకర్లు 

ఆందోళనలో లబ్ధిదారులు 

 సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మొర 

నిర్లక్ష్యంగా అధికారుల సమాధానం? 

తాండూరు: షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఆడపడుచులకు ప్ర భుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇం దులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దే ముల్, తాండూరు మండలాలకు చెంది న ఆడపడుచుల వివాహాల అనంతరం ఈనెల 5న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మ హేందర్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. యాలాల మండలానికి చెందిన 30 మం ది, తాండూరు మండలం 32, పెద్దేముల్‌ 13, బషీరాబాద్‌ 17 చెక్కులను మొత్తం 92 మంది రూ.58 లక్షల చెక్కులను పం పిణీ చేశారు. మంత్రి చేతుల మీదుగా కొంత మందికి అందించిన అనంతరం ఆయా మండలాల్లోని తహసీల్దార్‌లు లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశా రు. అయితే మంత్రి, అధికారులు పంపి ణీ చేసిన చెక్కులను తీసుకొని లబ్ధిదారులు తమ ఖాతాల్లో వేసేందుకు వెళితే.. చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని పలువురు లబ్ధిదారులు తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యా లయంలో చెప్పుకొనేందుకు వెళ్లగా అక్క డి ఉద్యోగి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక విలేకరులకు తమ గోడును విన్నవించుకున్నారు. 

యాలాల మండలం ముకుందాపూర్‌కు చెందిన లావణ్యకు పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామానికి చెందిన వెంకటప్పతో గతేడాది వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం రూ.51 వేలు చెక్కును మంజూరు చేసింది. మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఇటీవల చెక్కును అందుకున్నారు. మంగళవారం ఏడీబీ బ్యాంకులో చెక్కు వేసేందుకు వెళితే చెల్లదన్న సమాధానం అధికారుల నుంచి రావడంతో చేసేది లేక వెనుతిరిగారు. 
 
యాలాల మండలం ముద్దాయిపేట్‌కు చెందిన వాసిద్‌ఖాన్, నసామా దంపతుల కుమార్తె నజ్నిన్‌ఖాతూన్‌ను పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన ముబీన్‌తో వివాహం అయ్యింది. షాదీ ముబారక్‌ కింద జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 5న చెక్కును ప్రభుత్వం నుంచి అందుకున్నారు. తీరా బ్యాంకుకు వెళితే చెక్కు చెల్లదంటూ అధికారులు చెప్పడంతో వారు ఆందోళన చెందారు. 

బ్యాంకర్లతో మాట్లాడతా.. 
షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం లేదు. ఈ పథకానికి సంబంధించిన చెక్కులు చెల్లవన్న బ్యాంకర్లతో మాట్లాడుతా. ఈవిషయమై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా. పథకాలకు సంబంధించి అందించిన చెక్కులనన్నీ.. డివిజన్‌ పరిధిలో పంపిణీ చేశాం. ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తాము. 
– అశోక్‌కుమార్, డీఏఓ, 
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, తాండూరు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top