నాంపల్లి ఠాణాకు కొత్వాల్‌

hyderabad police commissioner surprise visit nampally police station - Sakshi

స్టేషన్‌ అడ్రస్‌ దొరక్క తికమక 

మూడు ప్రాంతాల్లో తిరిగిన వైనం...

నాంపల్లి: నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానికంగా నివాసం ఉండే రౌడీషీటర్‌పై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే స్టేషన్‌ చిరునామా దొరక్క ఆయనతోపాటు సిబ్బంది కూడా కాసేపు తికమక పడ్డారు. తొలుత నిలోఫర్‌ దగ్గర నిర్మాణంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ స్టేషన్‌ లేదని తెలుసుకున్నాక కొంతదూరం ముందుకు వెళ్లారు.

మార్గమధ్యలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌ అనుకుని నాంపల్లి ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ట్రాఫిక్‌ పోలీసులు నగర కమిషనర్‌ను చూసి అవాక్కయ్యారు. తదుపరి శాంతినగర్‌ పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. కాన్వాయ్‌ దిగిన కొత్వాల్‌ అంజనీకుమార్‌ నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఛాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ కాసేపు ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ కుమార్‌తో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టిసారించడానికి తాను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు వివరించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top