జిల్లా మొత్తంలో ఎండ తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిపోయింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం అల్లాడి పోతున్నారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లా మొత్తంలో ఎం డ తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారిపోయిం ది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం అల్లాడి పోతున్నారు. శనివారం 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో అన్ని వయసుల వారు వేడిని తట్టుకోలేక అవస్థ పడాల్సి వచ్చింది.
భానుడు భగ్గుమంటుండటం తో జిల్లా అగ్ని గుండంలా మారింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దాదా పు వారం రోజుల నుంచి గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక జిల్లాలో శనివారం 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దీంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. ఉపాధి కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పనులపై వెళ్లేవారు ఉదయాన్నే వెళ్తున్నా రు. ఉదయం 10 గంటల తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మళ్లీ సాయంత్రం తర్వాత రహదారులు ప్రజలతో క్రిక్కిరిసిపోతున్నాయి. వడదెబ్బతో జిల్లాలో పలుచోట్ల మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాం తాల్లో విద్యుత్ కోతలు అధికం కావడంతో జనం సతమతం అవుతున్నారు. మూడు రోజుల నుం చి పెరిగిన ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు వీస్తుండటంతో చిన్నపిల్లలు, వయో వృద్ధులు తట్టుకోలేక అవస్థ పడుతున్నారు.