జన జాతరకు అనుమతివ్వండి | High Court order to police for Jana jatara Permission | Sakshi
Sakshi News home page

జన జాతరకు అనుమతివ్వండి

Mar 30 2018 2:34 AM | Updated on Sep 4 2018 5:44 PM

High Court order to police for Jana jatara Permission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 15న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తలపెట్టిన జన జాతరకు అనుమతివ్వాలని హైకోర్టు గురువారం హైదరాబాద్‌ పోలీసులను ఆదేశించింది. ఈ కార్యక్రమం వివరాలు..ఎంతమంది హాజరవుతారు తదితర అంశాలను పోలీసులకు అందజేయాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. వీటిని పరిశీలించి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమ నిర్వహణకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జన జాతర కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ నిర్వాహక సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement