సామాజిక సేవకు మేము సైతం..   

Guru kula students to 'EFLU' Journalism Course - Sakshi

‘ఇఫ్లూ’ జర్నలిజం కోర్సుకు గురుకుల విద్యార్థులు

దేశవ్యాప్తంగా 13 మంది ఎంపిక

వీరిలో ముగ్గురు  మనవారే ఉండటం విశేషం

రాయదుర్గం : గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సులకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 13 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వీరిలో ముగ్గురు గౌలిదొడ్డి ఐఐటీ గురుకుల విద్యార్థులే కావడం విశేషం. మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీలో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశం వచ్చింది.

ఇటీవలే జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ చాటి అడ్వాన్స్‌కు అర్హత సాధించిన గురుకుల విద్యార్థులు రమేష్‌చంద్ర, ఎ.మదర్‌ ఇండియా, జి. శశిశ్వేత జర్నలిజం కోర్సుకు ఎంపికయ్యారు. ఇటీవలే నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటి విద్యార్థులు సీట్లు సాధించడం విశేషం. ఇఫ్లూ యూనివర్సిటీ జర్నలిజం కోర్సుకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్‌ వివేకానందను టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అభినందించారు. 

విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం..  

గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో ఐఐటీ, నీట్‌ కు శిక్షణ ఇస్తామని, కానీ విద్యార్థులు తమ ఇష్టం తో చదివి జర్నలిజం కోర్సును ఇఫ్లూ యూనివర్సిటీలో చేసేందుకు ఆసక్తి కనబరిస్తే ప్రోత్సహిం చా మని ప్రిన్సిపాల్‌ వివేకానంద పేర్కొన్నారు. ప్రభు త్వం ద్వారా పూర్తి వ్యయాన్ని భరించి చదివించేందుకు కార్యదర్శి అంగీకరించారన్నారు. గౌలిదొడ్డి ఐఐటీ కళాశాల ద్వారా గత ఏడాది నలుగురు ఐఐటీ సీట్లు, 15 మంది ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా 8 మంది విద్యార్థులు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి ఎంపికయ్యారని ఆయన తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top