జిల్లాను గుడుంబా రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ నెల 21న దీనిపై ప్రకటన చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు నిర్ణయించారు.
► 21న ప్రకటన చేసే అవకాశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాను గుడుంబా రహిత ప్రాంతంగా ప్రకటించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ నెల 21న దీనిపై ప్రకటన చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు నిర్ణయించారు. గుడుంబా తయారీ, వినియోగం, నష్టాలపై ఎక్సైజ్ శాఖ చేపట్టిన అవగాహన, చైతన్య కార్యక్రమాలతో సత్ఫలితాలు వచ్చాయని, దీంతో ఇప్పటికే 95శాతం గుడుంబా రహిత ప్రాంతంగా గుర్తించినట్లు చెప్పారు. గుడుంబా విక్రయాలను కూడా పూర్తిగా అరికట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈనెల 21న వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించి గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.