రోడ్డు ప్రమాదాలను నివారించాలి | Green Telangana trs govt Target | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

Jul 13 2016 1:31 AM | Updated on Sep 4 2017 4:42 AM

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

చింతపల్లి : హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాల్ మార్కెట్‌యార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.
 
  హరిత తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు.
 
 అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు మాల్‌లో తమకు వసతి గృహం సదుపాయం లేదని మంత్రి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ సమస్య పరిష్కారం కోసం వెంటనే కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
  ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్, సీఐ బాలగంగిరెడ్డి, ఎంపీపీ రవి, జెడ్పీటీసీ హరినాయక్, తహసీల్దార్ దేవదాస్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఓ రాంచందర్‌నాయక్, స్థానిక సర్పంచ్ అంగిరేకుల విజయాగోవర్ధన్, ఎంపీటీసీ చేపూరి జగదాంబ, మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, తిప్పర్తి సురేష్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, హన్మంతు వెంకటేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోపిడి కిష్టారెడ్డి, ముచ్చర్ల యాదగిరి, మాస భాస్కర్, నట్వ గిరిధర్, బోరిగం భూపాల్, ఎల్లెంకి అశోక్, నరేందర్‌రావు, బిచ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement