'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన' | government policies made among people, says T. Harish Rao | Sakshi
Sakshi News home page

'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'

Jul 9 2014 2:06 PM | Updated on Sep 2 2017 10:03 AM

'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'

'ప్రజల మధ్యే పథకాల రూపకల్పన'

పాలసీలు సచివాలయంలో కాదు, ప్రజల మధ్య రూపొందిస్తామని తెలంగాణ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు.

హైదరాబాద్: పాలసీలు సచివాలయంలో కాదు, ప్రజల మధ్య రూపొందిస్తామని తెలంగాణ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. రైతుబంధు పథకం చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు బంధు పథకంలో ఆర్నెల్ల వరకు రైతులకు వడ్డీలేని రుణాలిస్తామన్నారు. రుణం రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షలకు పెంచుతామన్నారు.

మార్కెట్‌ యార్డుల్లో 10 రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఇ-మార్కెటింగ్ వ్యవస్థను త్వరలో అమల్లోకి తెస్తామన్నారు. రూ.13 వేల కోట్లతో చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. పసుపు పరిశోధన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చేట్లు ప్రయత్నిస్తామని హరీశ్‌రావు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement