రాజీవ్ రహదారి విస్తరణపై పాలకుల నిర్లక్ష్యం | governance negligance in rajiiv highway | Sakshi
Sakshi News home page

రాజీవ్ రహదారి విస్తరణపై పాలకుల నిర్లక్ష్యం

Sep 10 2015 5:07 PM | Updated on Sep 3 2017 9:08 AM

హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా రామగండం వరకు రాజీవ్ రహదారిపై నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనుల నిర్మాణాలు పూర్తి చేయించడంలో గత ప్రభుత్వం తరహాలోనే నేటి ప్రభుత్వం నడుకుంటుందని తెలంగాణా దలిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ పేర్కొన్నారు.

కొండపాక: హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా రామగండం వరకు రాజీవ్ రహదారిపై నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనుల నిర్మాణాలు పూర్తి చేయించడంలో గత ప్రభుత్వం తరహాలోనే నేటి ప్రభుత్వం నడుకుంటుందని తెలంగాణా దలిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు దేవి రవీందర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా జనరల్ సెక్రటరీ నూనె కుమార్‌తో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడుతూ..  హైదరాబాద్‌ నుంచి రామగండం వరకు రాజీవ్ రహదారిపై పూర్తి స్థాయిలో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని కుకునూర్‌పల్లి - మంగోల్ గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై పూర్తి స్థాయిలో డివైడర్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు ఢీ కొంటున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement