ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో చోరీ జరిగింది.
ఖమ్మం జిల్లాలో భారీ చోరీ
Jul 7 2016 4:36 PM | Updated on Sep 4 2017 4:20 AM
	ఎర్రుపాలెం : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడులో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వేమిరెడ్డి పెద్ద శివారెడ్డి ఇంట్లో 13 కాసుల బంగారం చోరీకి గురైంది. శివారెడ్డి తన కుటుంబంతో కలసి ఈ నెల 4న తిరుపతి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న బీరువాని పరిశీలించి చూడగా 13 కాసుల బంగారం మాయమైంది. దీనిపై శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివారెడ్డి కుటుంబసభ్యులు తిరుపతి కి వెళ్లినపుడు ఇంట్లో ఆయన అత్త ఒక్కరే ఉన్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. తనకు ఏమి తెలియదని, తాను బయటికి వెళ్లినపుడు చోరీ జరిగి ఉండవచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేసింది. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ రాంరెడ్డి, మధిర సీఐ వెంకటేశ్వరరావు పరిశీలించారు. డాగ్‌స్వాడ్ తో వివరాలు సేకరిస్తున్నారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
