రైలు దూసుకొచ్చినా మూసుకోని గేట్లు | Gates are not closing even when train comes | Sakshi
Sakshi News home page

రైలు దూసుకొచ్చినా మూసుకోని గేట్లు

Sep 13 2016 3:30 AM | Updated on Sep 4 2017 1:13 PM

రైలు దూసుకొచ్చినా మూసుకోని గేట్లు

రైలు దూసుకొచ్చినా మూసుకోని గేట్లు

రైలు దూసుకొచ్చినా పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూయకపోవడంపై ద.మ.రై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

సాక్షి, హైదరాబాద్: రైలు దూసుకొచ్చినా పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూయకపోవడంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారు లు దృష్టి సారించారు. గత సంవత్సరం నాందేడ్ ప్యాసింజర్ రైలు, పాఠశాల బస్సును మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఢీకొన్న ఘటనలో 18 మంది విద్యార్థులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే లెవెల్ క్రాసింగ్‌లపై పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కాపలా లేని క్రాసింగ్‌ల వద్ద గేట్‌మిత్ర పేరిట ప్రత్యేక సిబ్బందిని అధికారులు నియమించారు. అయినా పలు ప్రాంతాల్లో రైలు దూసుకొచ్చినప్పుడు గేట్లు పడకపోవడం గమనార్హం.

రైలు ప్రయాణికుల భద్రతపై ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయాలు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా దృష్టికి వచ్చాయి. దీంతో విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్టేషన్‌లోకి రైలు రాగానే, అది బయలుదేరేలోపే స్టేషన్ మాస్టర్ ఆ స్టేషన్ పరిధిలోని లెవల్‌క్రాసింగ్‌ల గేట్‌మెన్‌కు ముందస్తు సమాచారం ఇస్తారు. ఈ సందర్భంగా ఇద్దరూ కోడ్ నంబర్ ఇచ్చిపుచ్చుకుని రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. నంబర్లు ఒకేవిధంగా ఉండకుంటే సమన్వయలేమిగా గుర్తిస్తారు. మానవతప్పిదం వల్లేగేట్లు మూసుకోవటం లేదని ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement