breaking news
Railway Level Crossing
-
గేటు తెరవలేదని చేతులు నరికేశారు
న్యూఢిల్లీ: రైల్వే లెవెల్ క్రాస్ గేటును తెరవడానికి నిరాకరించాడని గుర్తు తెలియని వ్యక్తులు గేట్‌మన్ చేతులు నరికేసిన ఘటన ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని నరేలాలో చోటు చేసుకుంది. కుందన్పాఠక్ (28) అనే వ్యక్తి నరేలా–రత్దానా మధ్య 19వ నంబర్ రైల్వే గేట్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గేట్ తెరవాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఆ సమయంలో మూరి ఎక్స్‌ప్రెస్ వస్తున్నదని పాఠక్ గేట్ తెరిచేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముష్కరులు పాఠక్‌ను చావబాది చేతులను నరికివేశారు. ఈ దాడిలో పాఠక్ కాళ్లు, మెడకూడా దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావమైన అతడిని ఆస్పత్రికి తరలించారు. పాఠక్ చేతులకు శస్త్రచికిత్స జరుగుతోందని, కోలుకునే వరకు రైల్వే తరఫున అన్నివిధాలా సాయం అందిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. -
రైలు దూసుకొచ్చినా మూసుకోని గేట్లు
సాక్షి, హైదరాబాద్: రైలు దూసుకొచ్చినా పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూయకపోవడంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారు లు దృష్టి సారించారు. గత సంవత్సరం నాందేడ్ ప్యాసింజర్ రైలు, పాఠశాల బస్సును మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఢీకొన్న ఘటనలో 18 మంది విద్యార్థులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే లెవెల్ క్రాసింగ్‌లపై పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కాపలా లేని క్రాసింగ్‌ల వద్ద గేట్‌మిత్ర పేరిట ప్రత్యేక సిబ్బందిని అధికారులు నియమించారు. అయినా పలు ప్రాంతాల్లో రైలు దూసుకొచ్చినప్పుడు గేట్లు పడకపోవడం గమనార్హం. రైలు ప్రయాణికుల భద్రతపై ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయాలు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా దృష్టికి వచ్చాయి. దీంతో విచారణకు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్టేషన్లోకి రైలు రాగానే, అది బయలుదేరేలోపే స్టేషన్ మాస్టర్ ఆ స్టేషన్ పరిధిలోని లెవల్‌క్రాసింగ్‌ల గేట్మెన్కు ముందస్తు సమాచారం ఇస్తారు. ఈ సందర్భంగా ఇద్దరూ కోడ్ నంబర్ ఇచ్చిపుచ్చుకుని రిజిస్టర్లో నమోదు చేస్తారు. నంబర్లు ఒకేవిధంగా ఉండకుంటే సమన్వయలేమిగా గుర్తిస్తారు. మానవతప్పిదం వల్లేగేట్లు మూసుకోవటం లేదని ప్రాథమికంగా గుర్తించారు.