పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది.
నాగార్జునసాగర్ : పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యువ రైతు పి.వేణు(22) బుధవారం ఉదయం తన పొలంలో మందు చల్లుతున్నాడు. పొలంపై నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైను తీగ తెగి కింద పడింది. అయితే వేణు దాన్ని చూసుకోకుండా తాకాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.