సెప్టెంబర్ 14న తొలి హజ్ ఫ్లైట్ | First flight of 2013 Hajj departs September 14 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 14న తొలి హజ్ ఫ్లైట్

Aug 13 2014 3:59 AM | Updated on Sep 2 2017 11:47 AM

హజ్ యాత్ర తొలి ఫ్లైట్ సెప్టెంబర్ 14న ఉదయం 11.30 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఏ. షుకూర్ వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర తొలి ఫ్లైట్ సెప్టెంబర్ 14న ఉదయం 11.30 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఏ. షుకూర్ వెల్లడించారు. ఈ ఫ్లైట్ ద్వారా 350 మంది యాత్రికులను జెడ్డాకు పంపిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 6050 మందిని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు.  సెప్టెంబర్ 12 నుంచి నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో యాత్రికులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement