అప్పుల బాధతో రైతు బలవన్మరణం | farmer suicidedue to debts in rangareddy distirict | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

Sep 29 2015 11:02 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వికారాబాద్: అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన ఎండీ కాశీం(40)తనకున్న రెండెకరాలతో పాటు మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటలు సరిగా పండకపోవటంతో కాశీం తీవ్ర నిస్పృహకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం పొలానికి వెళ్లి, పురుగు మందు తాగాడు. సాయంకాలం అయినా తిరిగిరాకపోవడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులకు పొలంలో విగత జీవిగా కనిపించాడు. వెంటనే అతడిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. అతడికి భార్య,  కుమార్తె ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement