
మత్తిచ్చి.. దోచుకెళ్లారు
రెండు రోజుల క్రితమే ఇంట్లో అద్దెకు చేరారు. యజమాని కుటుంబానికి దగ్గరయ్యారు. వారితోనే కాకరకాయ కూర చేయించుకున్నారు.
♦ కూరలో మత్తు మందు కలిపి
♦ మంగళసూత్రాల అపహరణ
♦ తొమ్మిది తులాల బంగారంతో
♦ ఉడారుుంచిన తల్లీకొడుకులు
♦ మేడ్చల్ మండలం పూడూర్‌లో ఘటన
మేడ్చల్ రూరల్ : రెండు రోజుల క్రితమే ఇంట్లో అద్దెకు చేరారు. యజమాని కుటుంబానికి దగ్గరయ్యారు. వారితోనే కాకరకాయ కూర చేయించుకున్నారు. యజమానులను ఏమార్పి అందులో మత్తు కలిపారు. వాటిని బలవంతంగా తినిపించారు. వారు మత్తులోకి జోగగానే వారి మెడల్లోని 9 తులాల విలువైన మంగళసూత్రాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన వుండల పరిధిలోని పూడూర్‌లో మంగళవారం వెలుగు చూసింది. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. వెంకయ్య, రాములమ్మ దంపతులు, వీరి కుమారుడు, రవి, నీరజ దంపతులు, వీరి పిల్లలు శివాని, మణికంఠ, వెంకటేష్‌లు గ్రామంలో నివాసముంటున్నారు.
రవి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే నెల రోజుల క్రితం రావల్‌పోల్ చౌరస్తా వద్ద గల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. వీరు ఉంటున్న ఇంటి పై భాగంలో ఓ పోర్షన్‌ను అద్దెకు ఇచ్చారు. అయితే మరో రూం ఖాళీ ఉంది. 15 రోజుల క్రితం తల్లీకొడుకులు వచ్చి తమది వరంగల్ జిల్లా ఆలేరు జనగాం అని, గదిలో అద్దెకు ఉంటామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. రెండు రోజుల క్రితమే ఇంట్లో చేరారు. అప్పటి నుంచి యజమానులతో వీరు చనువుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రవి డ్యూటీకి వెళ్లాడు. ఇదే సమయంలో అద్దెకుంటున్న వుహిళ.. తన వద్ద కాకరకాయలు ఉన్నాయని వాటిని వండి ఇవ్వాలని నీరజను కోరింది. దీంతో ఆమె కూర వండి ఇచ్చింది.
ఈ సమయంలో సదరు మహిళ కల్లుతో పాటు కూల్‌డ్రింక్ తెప్పించింది. రవి తల్లి రాములమ్మ, కొత్తగా అద్దెకు దిగిన మహిళ కల్లు తాగగా.. పిల్లలు, నీరజలు కూల్‌డ్రింక్ తాగారు. ఇంతలో కుమారుడికి కూర వడ్డించి వస్తాని చెప్పిన మహిళ.. తాను ఉంటున్న పోర్షన్‌కు వెళ్లి అందులో మత్తుమందు కలిపి కొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చింది. ఇంత కూర మాకు ఎక్కువ అవుతుందని, దీనిని మీరూ తినాలని రాములమ్మ, నీరజలను కోరింది. అయితే నీరజ కూర తింటూ ఏదో రకంగా అనిపిస్తోందని చెప్పగా.. చేదుగా ఉంటే బెల్లం కలిపానని సదరు మహిళ చెప్పింది. వీరు కూరను తిన్న కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటికే పిల్లలు నిద్రపోవడం, రాములమ్మ భర్త వెంకయ్య వయస్సులో పెద్దవాడు కావడంతో ఆయన మరో రూంలో పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన తల్లీకొడుకులు.. రాములమ్మ, నీరజ వంటిపై ఉన్న తొమ్మిది తులాల విలువైన బంగారు పుస్తెల తాళ్లను దోచుకెళ్లారు.
వుంగళవారం ఉదయుం రవి.. డ్యూటీ నుంచి ఇంటికి రాగానే తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా భార్య, తల్లి అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గమనించారు. అదీగాక కొత్తగా వచ్చిన మహిళ, ఆమె కుమారుడు కూడా లేకపోవడంతో ఇం ట్లో దొంగతనం జరిగిందని ఊహించి పోలీసులకు సమాచారం అందించాడు. అపస్మారక స్థితిలో ఉన్న రావుులవ్ము, నీరజలను సికిం ద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు పవన్, గోపరాజు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీ లించారు. తల్లీకువూరులు అద్దెకు ఉన్న ఇంట్లో వెతకగా క్షుద్రపూజల తరహాలో పూజలు చేసి ఉండడంతో, పాటు గదిలో ఒక సిమ్ కార్డును లభ్యమైంది. నీరజ స్పృహలోకి రాగానే... ఎలా జరిగిందని ప్రశ్నించగా.. కొత్తగా వచ్చిన మహిళ కాకరకాయు కూర తినిపించిందని తెలిపింది. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.