గుప్త నిధుల కోసం తవ్వకాలు | Digging for Hidden treasures in Adilabad | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Aug 20 2015 6:36 PM | Updated on Aug 17 2018 2:53 PM

పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో జరిగింది.

వేమనపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో జరిగింది. వివరాల ప్రకారం.. సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది.

అయితే బుధవారం రాత్రి కొంతమంది దుండగులు ఈ ఆలయంలో చోరబడి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement