31 జిల్లాలను అనుసంధానిస్తూ.. వాట్సప్‌ గ్రూప్‌ | DGP Mahender Reddy Launches Cop Connect Whatsapp Group | Sakshi
Sakshi News home page

Jun 18 2018 4:15 PM | Updated on Jun 18 2018 4:18 PM

DGP Mahender Reddy Launches Cop Connect Whatsapp Group - Sakshi

డీజీపీ మహేందర్‌ రెడ్డి(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌ : పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది వరకు సమాచారాన్ని చేరవేసేందుకు, అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ‘కాప్‌ కనెక్ట్‌’ పేరుతో డీజీపీ మహేందర్‌ రెడ్డి ఒక వాట్సప్‌ గ్రూప్‌ను సోమవారం ప్రారంభించారు. కేవలం పోలీసుల కోసమే ఈ ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ రూపొందించారు. మొత్తం 31 జిల్లాల 63 వేల మంది సిబ్బందికి ఏకకాలంలో సమాచారం అందించేందుకు ఈ వాట్సప్‌ గ్రూప్‌ ఉపయోగించనున్నారు.

సాధారణ వాట్సప్‌ గ్రూప్‌లాగే ఇందులో చాటింగ్‌, ఆడియో, వీడియో, లొకేషన్‌ షేరింగ్‌ చేయవచ్చు. పోలీస్‌ నెట్‌వర్క్‌లో ఉన్న ఫోన్‌లకు మాత్రమే ఈ గ్రూప్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీలో భాగంగా పోలీసింగ్‌ విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement