కూతురుని చంపి, తల్లి ఆత్మహత్య | daughter Killed , mother committed suicide | Sakshi
Sakshi News home page

కూతురుని చంపి, తల్లి ఆత్మహత్య

Dec 2 2014 1:37 AM | Updated on Sep 2 2017 5:28 PM

భర్త వేధింపులకు తాళలేక 11నెలల పసిగుడ్డును చంపి, ఓ మాతృమూర్తి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్‌లో సోమవారం రాత్రి

 చౌటుప్పల్ : భర్త వేధింపులకు తాళలేక 11నెలల పసిగుడ్డును చంపి, ఓ మాతృమూర్తి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన కాసోజు అనిత (21), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన కొండోజు ప్రవీణ్‌చారి (26)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 11నెలల పాప స్పందన ఉంది. ప్రవీణ్‌చారి కులవృత్తి చేస్తున్నాడు. అనితకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తాత నానమ్మలే పెంచిపెద్దచేశారు. ఇంటర్మీడియట్ వరకు చదివించి పెళ్లిచేశారు.
 
 పెళ్లయిన నాటినుంచి ప్రవీణ్‌చారి వరకట్నం కోసం వే ధిస్తున్నాడు. గత 15రోజుల క్రితం అనిత కూతురుతో కలిసి, పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం తాత నానమ్మలతో అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, కూతురు ఊపిరి ఆడకుండ చేసి చంపింది. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాతనానమ్మలు వచ్చి చూసి, లబోదిబోమన్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం  మృ తదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement