గుంటూరు జిల్లాలో అంధకారంలో 20 గ్రామాలు | current cut in 20 villages in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో అంధకారంలో 20 గ్రామాలు

Apr 30 2015 8:28 AM | Updated on Sep 3 2017 1:10 AM

ట్రాన్స్‌కో అధికారుల కారణంగా దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా బంద్ అయింది.

మాచర్ల(గుంటూరు): ట్రాన్స్‌కో అధికారుల కారణంగా దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా బంద్ అయింది. ఇటీవలి ఈదురుగాలులకు దుర్గి మండలంలో చెట్లు కూలి, స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ అధికారులు రోజంతా కష్టపడి వాటన్నిటినీ సరిచేసి, ట్రాన్స్‌కోకు క్లియరెన్స్ ఇచ్చారు. అయితే, ట్రాన్స్‌కో యంత్రాంగం స్పందించకపోవటంతో మండలంలోని నాలుగు సబ్‌స్టేషన్ల పరిధిలోని దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి కరెంట్ లేదు.

 

దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement