ఆర్టీసీ కార్మికులకు బియ్యం పంపిణీ | Congress Leaders Distributes Rice Bags To TSRTC Labours In Mahabubnagar | Sakshi
Sakshi News home page

46వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

Nov 20 2019 9:57 AM | Updated on Nov 20 2019 9:57 AM

Congress Leaders Distributes Rice Bags To TSRTC Labours In Mahabubnagar - Sakshi

ఆర్టీసీ జేఏసీ నేతలకు బియ్యం పాకెట్లు అందజేస్తున్న కొత్వాల్‌ తదితరులు

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారం 46వ రోజుకు చేరింది. వేతనాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుండడంతో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. 

సాక్షి, మహబూబ్‌నగర్‌: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె మంగళవారం 46వ రోజుకు చేరింది.  కార్మికులకు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో 25 కిలోల చొప్పున 90 బియ్యం పాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మిక నేతలతో వెంటనే చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టే సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఎన్‌పీ వెంకటేశ్, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బెక్కరి అనిత,  చంద్రకుమార్‌గౌడ్, లక్ష్మణ్‌యాదవ్, అజ్మత్‌అలీ, సాయిబాబా, సుభాష్‌ఖత్రీ, జె.చంద్రశేఖర్, రాములుయాదవ్, ఫయాజ్, సరోజ, అమిత, శ్రీనివాస్‌రెడ్డి, అంజద్, హక్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎంపీ, బీజేపీ నేత ఏపీ జితేందర్‌రెడ్డి అందజేసిన 100 బియ్యం పాకెట్లను  దీక్ష శిబిరం వద్ద  కార్మికులకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రవీందర్‌రెడ్డి, బసప్ప, బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement