ఘనంగా ‘గణతంత్రం’ | cm chandrasekhar rao hoists national flag in pragati bhavan  | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘గణతంత్రం’

Jan 27 2018 3:00 AM | Updated on Sep 4 2018 5:37 PM

cm chandrasekhar rao hoists national flag in pragati bhavan  - Sakshi

జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర వేడుకలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. సీఎం కె.చంద్రశేఖర రావు ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని అమర జవాన్ల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. తర్వాత గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు స్వాగతం పలికారు. ముందుగా ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చున్నారు. సీఎం కొందరిని పిలిపించి తన పక్కన కూర్చోవాలని సూచించారు. శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్, స్పీకర్‌ మధుసూదనాచారి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, సలహాదారు వివేక్‌ను పిలిపించారు. 

ఎమ్మెల్యే కొండా సురేఖ తన మనవరాలిని సీఎం వద్దకు తీసుకురాగా, త్రివర్ణాలతో కూడిన చీరను ధరించిన ఆ చిన్నారిని ఆయన ఒడిలో కూర్చోబెట్టు కున్నారు. వేడుకల్లో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సైనిక దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం చివరలో అగ్నిమాపకశాఖ మూడు రంగుల బెలూన్లను గాల్లోకి ఎగరేయడం ఆకర్షించింది.

అధికారులకు అవార్డులు..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులకు అవార్డులను గవర్నర్‌ నరసింహన్‌ ప్రదానం చేశారు. అనితా రామచంద్రన్‌ (ఐఏఎస్‌), శశాంక్‌ (ఐఏఎస్‌), రాజేశ్‌కుమార్‌ (ఐపీఎస్‌), స్వాతి లక్రా (ఐపీఎస్‌), ఆర్‌.శోభ (ఐఎఫ్‌ఎస్‌), స్వర్గం శ్రీనివాస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పూర్వాపరాలను సేకరించి పుస్తకం రూపొందించ డంలో కృషిచేసిన నుపూర్‌ కుమార్, డి.రవీందర్‌రెడ్డి (ఫొటోగ్రాఫర్‌)లకు ప్రత్యేక అవార్డులిచ్చారు. టీఎస్‌– ఐపాస్‌ అమలులో సమర్థంగా పనిచేసిన 8 మంది అధికారులను ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ అవార్డులకు ఎంపిక చేసింది. ఎ.గోపాల్‌రావు (టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌–సీఎండీ), ఎ.జి.రమణప్రసాద్‌ (సీఈఐజీ), జి.రఘుమారెడ్డి(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌– సీఎండీ), చంద్రమోహన్‌ (ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌), సత్య నారాయణరెడ్డి(పీసీబీ–ఎంఎస్‌), సంగ సురేశ్‌ (పరి శ్రమలు–జేడీ), కె.చంద్రశేఖర్‌బాబు (పరిశ్రమలు– ఏడీ)లు అవార్డులు అందుకున్నారు.

కాంటింజెంట్‌ అవార్డులు..
గణతంత్ర వేడుకల్లో సైనిక, పోలీసు, ఎన్‌సీసీ బృం దాలు నిర్వహించిన పరేడ్‌ ఆకట్టుకుంది. ఉత్తమ ప్రద ర్శన నిర్వహించిన బృందాలు గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాయి. 4 జాక్‌ లీ (47 బ్రిగేడ్‌) తరఫున వినీత్‌ బోరా ప్రథమ బహుమతి అందుకున్నారు. 16 డోగ్రా రెజిమెంట్‌ (76 బ్రిగేడ్‌) రెండో బహుమతికి ఎంపికైంది. జూనియర్ల విభాగం లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ విద్యార్థుల బృందం మొదటి బహుమతి పొందింది. ఎన్‌సీసీ బాలికల బృందం ద్వితీయ బహు మతికి ఎంపికైంది. ఈ బృందం తరఫున అవార్డును పీవీ కుమారీ అందుకున్నారు. మహారాష్ట్ర రిజర్వ్‌ పోలీ సుల కవాతు బృందం ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement