చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్ | child kidnaping gang arrested in Nallagonda district | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

Jun 20 2014 6:35 PM | Updated on Oct 16 2018 8:46 PM

చిన్నపిల్లలను కిడ్నాప్ చేసున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

నల్లగొండ: చిన్నపిల్లలను కిడ్నాప్ చేసున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు దుండగుల్ని పట్టుకుని వారి నుంచి ఏడుగురు చిన్న పిల్లలను రక్షించారు. చిన్నారుల్లో హైదరాబాద్కు చెందినవారు ఆరుగురు, విజయవాడకు చెందిన ఒకరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ఐదుగురు పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్టు చెప్పారు. పిల్లలను అమ్మనవారిపైనా, కొన్నవారిపైనా క్రిమినల్ కేసు నమోదు చేశామని నల్లగొండ ఎస్పీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement