నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక కారు తగలబడింది.
డిచ్‌పల్లి(నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని నడిపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక కారు తగలబడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికంగా కలకలం రేపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం(బి) గ్రామానికి చెందిన బాలకృష్ణ, నాగరాజు అదే గ్రామానికి చెందిన స్నేహితుడి మారుతి జెన్ కారు (గ్యాస్ కిట్ ఉంది)లో ఆర్మూర్‌కు బయలు దేరారు.
నడిపల్లికి చేరుకునే సరికి కారు ఆగిపోయింది. ఇంతలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో అందులో ఉన్న ఇద్దరు కిందికి దిగారు. చూస్తుండగానే కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చి ఉంటాయని, కారులో ఉన్న గ్యాస్‌తో తక్కువ వ్యవధిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు అభిప్రాయం వ్య క్తం చేశారు.


