shot curcuit
-
మంటల్లో కాలిపోయిన కారు
డిచ్పల్లి(నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒక కారు తగలబడింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికంగా కలకలం రేపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం(బి) గ్రామానికి చెందిన బాలకృష్ణ, నాగరాజు అదే గ్రామానికి చెందిన స్నేహితుడి మారుతి జెన్ కారు (గ్యాస్ కిట్ ఉంది)లో ఆర్మూర్‌కు బయలు దేరారు. నడిపల్లికి చేరుకునే సరికి కారు ఆగిపోయింది. ఇంతలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో అందులో ఉన్న ఇద్దరు కిందికి దిగారు. చూస్తుండగానే కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చి ఉంటాయని, కారులో ఉన్న గ్యాస్‌తో తక్కువ వ్యవధిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు అభిప్రాయం వ్య క్తం చేశారు. -
విద్యుద్ఘాతంతో విద్యార్థి మృతి
హైదరాబాద్: వేసవి సెలవులు కావడంతో రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్న బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతిచెందిన సంఘటన నేరేడ్మేట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికి అమ్ముగూడలో నివాసముండే వెంకట్రావు, విక్టోరియాల కుమారుడు వేంకటేశ్వర్రావు(14) మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా.. బంతి ట్రాన్స్ఫార్మర్ పక్కన పడింది. దీంతో బంతిని తీయడానికి వెళ్లిన వెంకటేశ్వర్రావు ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
నల్లగొండ (మిర్యాలగూడ/త్రిపురారం): విద్యుదాఘాతంతో వేర్వేరు చోట్ల ఇద్దరు రైతన్నలు మృతిచెందారు. నల్లగొండ జిల్లాలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకెళితే.. త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హర్జ్యాతండాకు చెందిన రమావత్ హనుము(40) తనకున్న ఎకరంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. బుధవారం ఉదయం నీరు పెట్టడానికి పొలానికి వెళ్లి.. మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే, మిర్యాలగూడ మండలం గూడూరుకు చెందిన పెదపంగ వేణు(23) డిగ్రీ వరకు చదివి, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వరి చేనుకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు అన్న ఏడుకొండలుతో కలసి పొలానికి వెళ్లాడు. అర ఎకరం పొలంలో మందు పిచికారీ చేసి తన సొంత పొలంలో సాగు చేస్తున్న మరో ఎకరం వరికి మందు పిచికారీ చేసేందుకు వెళ్తూ .. పక్క పొలంలో తెగిపడి ఉన్న ఎర్త్‌వైర్ తగిలి వేణు అక్కడికక్కడే మృతిచెందాడు. -
విద్యుద్ఘాతంతో ఆటో డ్రైవర్ మృతి
గుంటూరు(తెనాలి): మండలంలోని ఐత్నగర్లో విద్యుద్ఘాతంతో వెంకయ్య(38) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు..ఐత్నగర్లోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద అనాథ శవం పడి ఉంది. ఆ శవాన్ని మున్సిపాలిటీ అధికారులకు అప్పగించడానికి వచ్చిన వెంకయ్య తల ప్రమాదవశాత్తూ టాన్స్‌ఫార్మర్ దగ్గర ఉన్న ప్యూజ్కు తగిలింది. పక్కనే ఉన్న స్ధానికులు కర్రతో కొట్టడంతో షాక్ నుంచి బయటపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న వెంకయ్యను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. చేర్చిన పావుగంటకి ప్రాణాలొదిలాడు.


