వేసవి సెలవులు కావడంతో రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్న బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతిచెందిన సంఘటన నేరేడ్‌మేట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్: వేసవి సెలవులు కావడంతో రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్న బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతిచెందిన సంఘటన నేరేడ్‌మేట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికి అమ్ముగూడలో నివాసముండే వెంకట్‌రావు, విక్టోరియాల కుమారుడు వేంకటేశ్వర్‌రావు(14) మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా.. బంతి ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పడింది.
దీంతో బంతిని తీయడానికి వెళ్లిన వెంకటేశ్వర్‌రావు ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్ మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


