బీరు తాగించించి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నం..! | shocking incident in banjara hills | Sakshi
Sakshi News home page

బీరు తాగించించి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నం..!

Apr 4 2026 7:38 AM | Updated on Apr 4 2026 9:18 AM

shocking incident in banjara hills

హైదరాబాద్: మహిళా చెఫ్‌పై హెడ్‌ చెఫ్‌ లైంగిక దాడికి యత్నంచిన ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్న మహిళ అనారోగ్యం కారణంగా ఇటీవల విధులకు వెళ్లడం లేదు. ఇదే హోటల్‌లో హెడ్‌ చెఫ్‌గా పని చేస్తున్న శ్యాం.. డ్యూటీకి సంబంధించిన మీటింగ్‌ ఉందని తన ఇంటికి రమ్మన్నాడు. గురువారం సాయంత్రం ఫిలిం నగర్‌లోని బీజేఆర్‌ నగర్‌లో ఉంటున్న శ్యాం ఇంటికి ఆమె వెళ్లింది. ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన అతను.. బీరు, బ్రాందీ సీసాలు పట్టుకు వచ్చాడు. 

బీరు తాగాలని ఆమెను బలవంతం చేశాడు. తాగనంటూ ఆమె నిరాకరించినా.. బలవంతంగా తాగించి  లైంగిక దాడికి యత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు యత్నంచగా.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. పొత్తి కడుపుపై కాలితో తన్నాడు. ఆమెను నిర్బంధించి కొన్ని అసభ్యకరమైన వీడియోలు చూపించాడు. ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు నేరుగా వెళ్లి ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement