లుథ్రా బ్రదర్స్‌కు బెయిల్‌.. అయినా జైలులోనే? | Goa fire tragedy Luthra brothers granted bail | Sakshi
Sakshi News home page

లుథ్రా బ్రదర్స్‌కు బెయిల్‌.. అయినా జైలులోనే?

Apr 2 2026 1:14 AM | Updated on Apr 2 2026 9:50 AM

Goa fire tragedy Luthra brothers granted bail

గతేడాది గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో నిందితులైన లూథ్రా బ్రదర్స్‌కు అక్కడి స్థానిక  కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే లూథ్రా బ్రదర్స్‌పై  ఫోర్జరీకి సంబంధించిన మరో కేసు కూడా ఉండడంతో వారిద్దరూ ప్రస్తుతానికి జైల్‌లోనే ఉండాల్సివచ్చింది.  

గత ఏడాది డిసెంబర్ 7న గోవాలోని అర్పోరాలో ఉన్న 'బిర్చ్ బై రోమియో' (Birch by Romeo) నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దాని యజమానులైన గౌరవ్ లూథ్రా మరియు సౌరభ్ లూథ్రాలు థాయిలాండ్‌కు పారిపోయారు. దీంతో గోవా పోలీసులు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత్‌ తీసుకువచ్చారు.

ఇద్దరు సోదరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉత్తర గోవాలోని కోల్వాలే సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే దీనిపై విచారించిన ధర్మాసనం ఈ కేసులో దర్యాప్తు పూర్తయి, ఛార్జిషీట్ దాఖలు చేసినందున, నిందితులను నిరవధికంగా జైలులో ఉంచడం సరైనది కాదని అభిప్రాయపడింది. దీంతో వీరిపై కొన్ని ప్రత్యేక ఆంక్షలు పెడుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా నైట్‌క్లబ్ నిర్వహణకు సంబంధించి ఫోర్జరీ (పత్రాల తారుమారు) చేసినట్లు వీరిపై మరో కేసు ఉండడంతో ప్రస్తుతం వారు జైలులోనే ఉండాల్సి వస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement