
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు సంబధిత అధికారులు హాజరయ్యారు. కాగా,రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.