శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు స్వాధీనం | Bullets seized from couple at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు స్వాధీనం

Jun 6 2015 7:14 PM | Updated on Mar 28 2018 11:08 AM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వైద్యులైన దంపతులు శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కెనడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా అధికారులు వారి లగేజీలో ఉపయోగించిన తొమ్మిది బుల్లెట్లు, నాలుగు వాడని బుల్లెట్లను గుర్తించి ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. షూటింగ్ పోటీల్లో పాల్గొంటున్న తన సోదరుడి బ్యాగు తీసుకురావడంతో పొరపాటున బుల్లెట్లు వచ్చినట్లు భార్యాభర్తలు వివరించారు. బుల్లెట్లకు సంబంధించిన లెసైన్స్, ఇతరత్రా పత్రాలను పరిశీలించి వారిని వదిలేసినట్లు ఆర్‌జీఐఏ సీఐ సుధాకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement