breaking news
Bullets seized
-
హైటెక్ ‘సాయి’
సాక్షి ప్రతినిధి కడప: సాయినాథశర్మ...కమలాపురం ప్రాంతవాసులకు సుపరిచితుడు. పాత్రికేయునిగా గుర్తింపు పొంది, ఆపై హైటెక్ రాజకీయ నాయకుడుగా రూపాంతరం చెందారు. వర్గ నాయకులను కాదని అనూహ్యంగా పెద్దచెప్పలి సింగిల్‌విండో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. అచ్చం అదే తరహాలో పోలీసు, రెవెన్యూశాఖలను మేనేజ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా తప్పుడు అడ్రసుతో పిస్తోల్ లైసెన్సు దక్కించుకున్నారు. బుల్లెట్లతో రేణిగుంట ఎయిర్‌పోర్టులో పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దచెప్పలి సింగిల్‌విండో అధ్యక్షుడు సాయినాథశర్మ 1980వ దశకం నుంచి కమలాపురంలో నివాసం ఉంటున్నారు. అయ్యప్పస్వామి దేవస్థానం సమీపంలో సొంత ఇళ్లు ఉంది. డోర్ నంబర్ 13/104లో దాదాపు 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అందులోనే ఆధార్, ఫాన్‌కార్డు, ఓటరు కార్డు తదితర ప్రభుత్వం మంజూరు చేసే గుర్తింపు కార్డులు ఉన్నాయి. కాగా చిన్నచౌక్ పరిధిలో డోర్ నంబర్ 36/221లో నివాసం ఉన్నట్లుగా 2015లో తుపాకీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టి లైసెన్సు తుపాకీ అవసరం ఉన్నట్లు గుర్తించి సిఫార్సులు చేశారు. ఆమేరకు 2016 నవంబర్ 3న అప్పటి జాయింట్ కలెక్టర్ లైసెన్సు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం అత్యంత గుట్టుచప్పుడు కాకుండా నడిచింది. కారణం కమలాపురం నివాసికి కడప చిన్నచౌక్ పరిధిలో లైసెన్సు మంజూరు చేయడమే. తుపాకీ లైసెన్సుకు దరఖాస్తు చేస్తే, దరఖాస్తుదారుడికి లైసెన్సు తుపాకీ అవసరమా..లేదా... దానిని అడ్డుపెట్టుకొని దందాలు చేసే అవకాశం ఉందా...అన్న విషయాన్ని ధ్రువీకరించాల్సింది పోలీసులు. వారి సిఫార్సులు ఆధారంగానే లైసెన్సుపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా సాయినాథశర్మ కమలాపురం ప్రాంత నివాసి అయి ఉండీ, కడప నగరం చిన్నచౌక్‌లో 36/221లో నివాసం ఉన్నట్లుగా దరఖాస్తు చేస్తే చిన్నచౌక్ పోలీసులు సిఫార్సు చేశారు. వారి సిఫార్సు ఆధారంగా లైసెన్సు మంజూరు చేస్తూ అప్పటి జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాపురంలో నివాసం ఉన్న సాయినాథ్‌ను కడపలో ఉంటున్నట్లు అప్పటి చిన్నచౌక్ సీఐ రామకృష్ణ ధ్రువీకరించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చేపట్టారా...టీడీపీ నేతల సిఫార్సులతో సీఐ ధ్రువీకరించారా అన్న విషయం తెలియాల్సి ఉంది. పదేళ్లుగా కమలాపురం నుంచి ఎక్కడికి నివాసం మార్చని సాయినాథ్ చిన్నచౌక్ అడ్రసులో ఎలా లైసెన్సు పొందారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. బుల్లెట్లు పట్టుబడడంతో.... 2017 నవంబర్ 3న పాయింట్ 32 పిస్తోల్ లైసెన్సు పొందిన సాయినాథశర్మ మార్చి 13న ఏషియన్ ఆర్మ్స్ సంస్థల్లో తన తుపాకీ డిపాజిట్టు చేశారు. అయితే బుల్లెట్లు తనవద్దే ఉంచుకున్నారు. స్థానికంగా పోలీసుస్టేషన్లో తుపాకీ అప్పగిస్తే.. బుల్లెట్లు లైసెన్సు రికార్డులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తుపాకులు విక్రయించే లైసెన్సు గోడౌన్లో లైసెన్సుదారుడు తన వెపన్ డిపాజిట్టు చేస్తే ఒరిజనల్ రశీదును పోలీసుస్టేషన్లో అప్పగించాలి. చిన్నచౌక్ పోలీసు స్టేషన్లో సాయినాథశర్మ తుపాకీ డిపాజిట్టు చేసినట్లు ఒరిజనల్ రశీదు ఇవ్వలేదు. కేవలం వాట్సాప్‌లో రశీదు ఫోటో మాత్రమే పంపించి చేతులు దులుపుకున్నారు. తప్పుడు నివాసంతో లైసెన్సు మం జూరుకు సిఫార్సు చేసిన చిన్నచౌక్ పోలీసులు, తుపాకీ డిపాజిట్టు చేసుకోవడంలో కూడా అలాంటి ధోరణే ప్రదర్శించారు. వాస్తవంగా రేణిగుంట ఎయిర్‌పోర్టు తనిఖీలో బుల్లెట్లు పట్టుబడకపోతే, సాయినాథశర్మ తుపాకీ లైసెన్సు విషయం వెలుగు చూసే అవకాశమే లేదు. నిజాయితీకి మారుపేరుగా ఎన్నికలు అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహించిన ఎస్పీ అభిషేక్‌మహంతి ఉన్నచోటే, కిందిస్థాయి సి బ్బంది కారణంగా పోలీసుశాఖ ప్రతిష్ట మంటగలుస్తోందని పలువురు వాపోతుండడం గమనార్హం. -
తనిఖీల్లో పట్టుబడ్డ ఎమ్మెల్యే.. అరెస్ట్..!
సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో బిహార్ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. అక్రమంగా బుల్లెట్లు కలిగి ఉండడంతో ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పట్నాకు బయలుదేరారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో.. ఎమ్మెల్యే లగేజీలో 3.15 బోర్ సైజుతో గల 10 బుల్లెట్లు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వాటికి సంబంధించిన పత్రాలేవీ సమర్పించకపోవడంతో ఆయుధ, మందుగుండు సామాగ్రి చట్టం ప్రకారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ మధేపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద నుంచి 33 రౌండ్ల బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్లు స్వాధీనం
శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వైద్యులైన దంపతులు శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కెనడా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా అధికారులు వారి లగేజీలో ఉపయోగించిన తొమ్మిది బుల్లెట్లు, నాలుగు వాడని బుల్లెట్లను గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. షూటింగ్ పోటీల్లో పాల్గొంటున్న తన సోదరుడి బ్యాగు తీసుకురావడంతో పొరపాటున బుల్లెట్లు వచ్చినట్లు భార్యాభర్తలు వివరించారు. బుల్లెట్లకు సంబంధించిన లెసైన్స్, ఇతరత్రా పత్రాలను పరిశీలించి వారిని వదిలేసినట్లు ఆర్జీఐఏ సీఐ సుధాకర్ తెలిపారు. -
విమాన ప్రయాణికుడి నుంచి బుల్లెట్ స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు శనివారం బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ వెళ్లేందుకు యత్నిస్తున్న ఆ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేశారు. ఆ క్రమంలో అతడి లగేజీలో కస్టమ్స్ అధికారులు బుల్లెట్‌ను కనుగొన్నారు. అనంతరం అతడిని ఎయిర్పోర్ట్ భద్రత సిబ్బందికి అప్పగించారు. భద్రత సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.