తనిఖీల్లో పట్టుబడ్డ ఎమ్మెల్యే.. అరెస్ట్‌..! | RJD MLA Arrested For Allegedly Carrying 10 Bullets At Delhi Airport | Sakshi
Sakshi News home page

ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ అరెస్ట్‌..!

Feb 22 2019 4:48 PM | Updated on Feb 22 2019 4:54 PM

RJD MLA Arrested For Allegedly Carrying 10 Bullets At Delhi Airport - Sakshi

ఢిల్లీ ఎయిర్‌పోర్టు

విమాన ప్రయాణం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో బిహార్‌ ఎమ్మెల్యే పట్టుబడ్డారు.

సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణం సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన తనిఖీల్లో బిహార్‌ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. అక్రమంగా బుల్లెట్లు కలిగి ఉండడంతో ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పట్నాకు బయలుదేరారు. అక్కడ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో.. ఎమ్మెల్యే లగేజీలో 3.15 బోర్‌ సైజుతో గల 10 బుల్లెట్లు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వాటికి సంబంధించిన పత్రాలేవీ సమర్పించకపోవడంతో ఆయుధ, మందుగుండు సామాగ్రి చట్టం ప్రకారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్‌ మధేపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement