భార్యను చంపి, ఉరి వేశాడు.. | beat his wife to death then hung her body | Sakshi
Sakshi News home page

భార్యను చంపి, ఉరి వేశాడు..

Mar 28 2015 9:47 AM | Updated on Sep 2 2017 11:31 PM

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపి, ఆపై ఉరి వేశాడు

మోర్తాడ్(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపి, ఆపై ఉరి వేశాడు. గ్రామానికి చెందిన బాజెత్తుల రాములుకు లక్ష్మి(27)తో వివాహమై ఆరేళ్లయింది. వీరికి సంతానం లేదు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రాములు, భార్యను రోజూ వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవపడి, విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె చనిపోగా మృతదేహానికి ఉరివేశాడు.
శనివారం ఉరిని తొలగించి, మంచంపై పడుకోబెట్టాడు. ఏమీ తెలియనట్లు తిరుగుతుండగా అతని తీరుపై చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు వచ్చి చూడగా ఘోరం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement