ఏవీ స్పైక్‌ రోడ్లు?

AV Spike Roads in Hyderabad - Sakshi

ఓఆర్‌ఆర్‌–రీజినల్‌ రింగ్‌ రోడ్డును కలుపుతూ రూపకల్పన

ఏడాది క్రితమే హెచ్‌ఎండీఏ ప్రణాళిక

25 మార్గాల్లో నిర్మించాలని నిర్ణయం

సుమారు రూ.1000 కోట్లు ఖర్చు కాగలదని అంచనా

సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో వాహనదారుల ప్రయాణం సులువుగా సాగేలా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఏడాది క్రితం రూపొందించిన సరికొత్త ప్రణాళిక ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును కలిపేలా నిర్మిస్తున్న రేడియల్‌ రోడ్ల మాదిరిగానే.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లను అనుసంధానిస్తూ ‘స్పైక్‌ రోడ్ల’ను నిర్మించాలనుకున్న ప్రణాళిక పట్టాలెక్కలేదు. శివార్లలో ఏర్పాటవుతున్న లాజిస్టిక్‌ హబ్‌లు, ట్రక్కు పార్కులు, ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినళ్లకు సులువుగా చేరేలా,  చర్లపల్లి, నాగులపల్లిలో ఏర్పాటు కానున్న రైల్వే టెర్మినల్‌కు వాహనదారులు ఈజీగా వెళ్లేలా ఈ రోడ్ల నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. వాస్తవానికి 25 ప్రాంతాల్లో దాదాపు 460 కి.మీ మేర కొత్త రోడ్లను నిర్మించాల్సి ఉందని, వీటిలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు ప్రాంతీయ రహదారులు కూడా ఉన్నాయని, వీటిని నాలుగు నుంచి ఆరు లేన్లుగా అభివృద్ధి చేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్లకు వ్యయం రూ.500 నుంచి 1,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. నగర శివారుల్లో ట్రక్కు పార్కులు, ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినళ్లకు చేరుకునే వాహనాల రాకపోకలకు ఈ స్పైక్‌ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వే టెర్మినల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా అచరణలోకి రాలేదు. 

స్పైక్‌ రోడ్లు ఏయే ప్రాంతాల్లో..
నేషనల్‌ హైవే –7, బెంగళూరు హైవే మీదుగా శంషాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ నుంచి పాల్మాకుల, కొత్తూరు ప్రాంతాల నుంచి ఫరూక్‌నగర్‌ అర్బన్‌ నోడ్స్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు (23.27 కి.మీ)
శంషాబాద్‌ నుంచి అమన్‌పల్లి నర్కొడ, కందూవాడ మీదుగా పమీనా గ్రామ
ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (27.28 కి.మీ)
పీరంచెరువు  అప్పాజంక్షన్‌ నుంచి మొయినాబాద్‌ మీదుగా చేవేళ్ల అర్బన్‌ నోడ్డు (26.33  కిలోమీటర్లు)
శంకర్‌పల్లి మంచిరేవుల నుంచి జన్వాడ, మోఖిల మీదుగా శంకర్‌పల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (26.27  కిలోమీటర్లు)
వెలముల నుంచి భానూర్‌ మీదుగాసింగపూర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (10.28  కిలోమీటర్లు)
నేషనల్‌ హైవే 9 ముత్తంగి జంక్షన్‌ నుంచి రుద్రారం మీదుగా కౌలంపేట హమ్లెట్‌ సమీపంలోని రుద్రారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (0.81 కిలోమీటర్లు)
రెండ్లగడ, ఐనోల్‌ మీదుగా ఇదతనూర్‌లోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(16.67  కిలోమీటర్లు)
దెల్వార్‌గూడ, కొడకంచి, అముదూర్‌ మీదుగా ఇస్మాయిల్‌ఖాన్‌ పూటసమీపంలోని అరుట్ల ఆర్‌ఆర్‌ఆర్‌కుఅనుసంధానం (22.7  కిలోమీటర్లు)
సుల్తాన్‌పూర్‌ నుంచి ఊట్ల, చింతల్‌చెరర్‌ మీదుగా మాచెర్ల ఆర్‌ఆర్‌ఆర్‌కుఅనుసంధానం (24.81  కిలోమీటర్లు)
రాష్ట రహదారి దొమ్మర పొచంపల్లి జంక్షన్‌ మీదుగా గగిల్‌పూర్, గుమ్మడిదల మీదుగా నర్సాపూర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (24.36  కిలోమీటర్లు)
జాతీయ రహదారి–7 కండ్లకోయ జంక్షన్‌ నుంచి మేడ్చల్, కల్లకల్, మనోహరబాద్‌ మీదుగా తుప్రమ్‌ అర్బన్‌ నోడ్‌కుఅనుసంధానం (26.25  కిలోమీటర్లు)
పుదుర్‌ నుంచి రాజ్‌ బొల్లారం, రవల్‌కొలె, బస్వాపూర్‌ మింజిపల్లి మీదుగాశంకారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (24.92 కిలోమీటర్లు)
రాష్ట్ర రహదారి కరీంనగర్‌ తూముకుంట జంక్షన్‌ నుంచి శామీర్‌పేట, అలియాబాద్, తుర్కపల్లి మీదుగా ములుగు ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (20.78  కిలోమీటర్లు)
శామీర్‌పేట నుంచి సంపన్‌బొలె, అనంతారం, మీదుగా అలియాబాద్‌ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(17.84  కిలోమీటర్లు)
నర్సంపల్లి నుంచి అద్రాస్‌పల్లె లింగాపూర్‌ నుంచి ముదుచింతపల్లెలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (12.33  కిలోమీటర్లు)
కీసర దైర జంక్షన్‌ నుంచి కీసర రంగాపురం నుంచి బొమ్మలరామారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (12.21  కిలోమీటర్లు)
ఘట్‌కేసర్‌ జంక్షన్‌ నుంచి ఔషాపూర్, రంగాపూర్‌ మీదుగా గుడూర్‌ గ్రామంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(18.03  కిలోమీటర్లు)
బాచారం జంక్షన్‌ నుంచి బండ్ల రివర్యాల, జూలూరు నుంచి రవల్‌పల్లి గ్రామంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(17.36  కిలోమీటర్లు)
అంబర్‌పేట కలన్‌ జంక్షన్‌ నుంచి అబ్దుల్లాపూర్, తూరన్‌పేట మీదుగా మల్కాపూర్‌ అర్బన్‌ నోడ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (16.18  కిలోమీటర్లు)
కొహెడ నుంచి అంజిపూర్, పొల్కంపల్లి మీదుగా దండుమైలారంలోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (14.86  కిలోమీటర్లు)
బొంగళూరు జంక్షన్‌ నుంచి చింతక్‌పల్లిగూడ, ఇబ్రహీంపట్నం నుంచి అఘాపల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం(15.22  కిలోమీటర్లు)
ఆదిభట్ల నుంచి ఫెరోజ్‌గూడ, యెలిమినేడు మీదుగా గుమ్మడివెల్లి ఆర్‌ఆర్‌ఆర్‌కుఅనుసంధానం (16.77  కిలోమీటర్లు)
రవిర్యాల నుంచి లెమూర్‌ మీదుగారాచ్లూర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (11.74  కిలోమీటర్లు)
మంకాల్‌ జంక్షన్‌ నుంచి మోహబత్‌నగర్, తుమ్మలూరు మీదుగా కొత్తూరు ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (12.86  కిలోమీటర్లు)
గోల్కొండ కలన్‌ నుంచి నాగిరెడ్డిపలలి, పింజర్ల మీదుగా దూస్కల్‌ గ్రామసరిహద్దులోని ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం (19.83  కిలోమీటర్లు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top