
జోగుళాంబ శక్తిపీఠం : అలంపూర్ జోగుళాంబ ఆలయంలో గురువారం 5వ రోజు అమ్మవారు స్కందమాత దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు నవావరణ అర్చనలతో పాటుగా కుమారి, సువాసిని పూజలు చేశారు. దేవస్థానం తరఫున ఈఓ ప్రేమ్‌కుమార్ ముత్తయిదువులకు చీరలు అందజేశారు.
ఏపీ నుంచి పట్టువస్త్రాలు
కాగా, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జోగుళాంబ అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు పంపించనున్నారు. ఈ నెల 4వ తేదీన కర్నూలు కలెక్టర్ వీరపాండ్యన్, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాయుడు ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు అందజేస్తారు.