వైభవంగా చక్రతీర్థం,మహాపూర్ణాహుతి  | Annual Brahmotsavas of Sri Lakshmi narasimha swamy in Yadadri | Sakshi
Sakshi News home page

వైభవంగా చక్రతీర్థం,మహాపూర్ణాహుతి 

Mar 18 2019 2:19 AM | Updated on Jun 4 2019 6:36 PM

Annual Brahmotsavas of Sri Lakshmi narasimha swamy in Yadadri - Sakshi

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులతోపాటు శ్రీచక్ర పెరుమాళ్లను అలంకారం చేసి ప్రత్యేక సేవలో పూజలు చేశారు. అదే విధంగా శ్రీ చక్ర పెరుమాళ్లకు చక్రతీర్థ స్నానం ఆచరింపజేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన ముక్కోటి దేవతలను ఆయా స్వస్థలాలకు పంపించే దేవతా ఉద్వాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు నల్లంథీగళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement