మద్యం దుకాణాలపై ఆంధ్ర వ్యాపారుల ఆసక్తి 

Andhra Merchants Interested In Telangana liquor Buisiness  - Sakshi

ఒక్కరోజే 181 దరఖాస్తులు 

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో మద్యం దుకాణాలను దక్కిం చుకునేందుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన మద్యం వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. సుమారు 30 మందికి పైగా ఆ రాష్ట్రానికి చెందిన వ్యాపారుల నుంచి దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీరు స్థా నిక మద్యం వ్యాపారుల భాగస్వా మ్యంతో ఇక్కడ మద్యం దుకాణాలను పొందేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటివరకు జిల్లాకు చెం దిన వ్యాపారులే దుకాణాలను దక్కించుకునేవారు.

ఈసారి కొత్త గా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఆసక్తి చూపడం ఆశాఖ వర్గా ల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మద్యం దుకాణాలకు మహిళల పేర్లతోనూ దరఖాస్తులు రావడం గమనార్హం. సుమారు 55 దరఖాస్తులు మహిళల పేర్లతో వ చ్చాయి. కొందరు వ్యాపారులు సెంటిమెంట్‌గా దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి జిల్లాలో 91 షాపులకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

మంగళవారం వరకు మొత్తం 383 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఒక్క మంగళవారం 181 మంది దరఖాస్తులు చేశారు. నేటి సాయం త్రం 4 గంటలతో దరఖాస్తులకు గడువు ముగుస్తుంది. నాలుగు గంటల లోపు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యా లయంలోకి వచ్చిన వారందరికి టోకెన్లు జారీ చే సి దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతినిస్తారు. 

17న దరఖాస్తుల జాబితా.. 
దరఖాస్తుదారుల జాబితాను ఈనెల 17న ప్రకటిస్తారు. 18న స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరి యంలో డ్రా నిర్వహిస్తారు. ఆరంభంలో దరఖా స్తుదారుల నుంచి స్పందన అంతంత మాత్రం గా ఉండగా.. గడువు ముగిసే సమయం వచ్చేసరికి కాస్త ఊపందుకుంది. రెండేళ్ల క్రితం 93 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే మొత్తం 1,326 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల రూపంలోనే ఎక్సైజ్‌శాఖకు రూ. 132.60 కోట్లు ఆదాయం లభించింది. ఈసారి దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెం చడంతో దరఖాస్తుల సంఖ్య కొంత మేరకు తగ్గే అవకాశాలున్నాయి. 

16 దుకాణాలకు నిల్‌  
జిల్లా వ్యాప్తంగా 16 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. చివరి రోజు వచ్చే అ వకాశాలున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్మూర్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ఎనిమిది, బోధన్‌ సర్కిల్‌ పరిధిలో నాలుగు, నిజా మాబాద్‌ సర్కిల్‌ పరిధిలో మూడు, మోర్తాడ్‌ పరిధిలో ఒక మద్యం దుకాణానికి దరఖాస్తులు చే యడానికి మంగళవారం వరకు ఎవ్వరూ ముం దుకురాలేదు. గతంలో ఆర్మూర్‌ మండలం మ చ్చర్ల మద్యం దుకాణానికి కూడా చివరి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు మద్యం వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. ఈసారి కొన్నింటికి ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

డ్రా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం 
మద్యం దుకాణాల కోసం ఆసక్తి గల వ్యాపారులు సకాలంలో తమ దరఖాస్తులను సమర్పించాలి. గడువు బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగుస్తుంది. ఈలోపు కార్యాలయానికి వచ్చిన వారి దరఖాస్తులను స్వీకరిస్తాము. ఈనెల 18న డ్రా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 
-నవీన్‌చంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top