‘ప్రణయ్‌ మళ్లీ పుట్టాడు’ | Amrutha Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత 

Jan 31 2019 11:56 AM | Updated on Jan 31 2019 12:09 PM

Amrutha Blessed With Baby Boy - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ప్రణయ్‌ మళ్లీ పుట్టాడు’అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట తమ పెళ్లి రోజును పురస్కరించుకుని అమృత తన ఫేస్‌బుక్‌లో ఒక ఫొటోతోపాటు సందేశాన్ని పోస్టు చేశారు. ‘నీకు (ప్రణయ్‌) మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మన వివాహమై నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజు నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. లవ్‌యూ లల్లు.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను‘అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం అమృత మగబిడ్డకు జన్మినిచ్చినట్లు మరో పోస్టు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement