రెండోసారి తల్లైన బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్ | Aashka Goradia and Brent Goble welcome second baby boy | Sakshi
Sakshi News home page

Aashka Goradia: రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి

May 8 2026 3:18 PM | Updated on May 8 2026 3:29 PM

Aashka Goradia and Brent Goble welcome second baby boy

ప్రముఖ బుల్లితెర నటి, బాలీవుడ్ భామ ఆస్కా గోరాడియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాడి డిసెంబర్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ బాబు పుట్టాడని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు పుట్టగా.. తాజాగా రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందారు. మే 1న తేదీన బిడ్డకు జన్మనివ్వగా.. వారం రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ బాలీవుడ్ బ్యూటీ అమెరికాకు చెందిన యోగా టీచర్, వ్యాపారవేత్త అయిన బ్రెంట్ గోబుల్ 2017లో పెళ్లాడింది. 2017లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట అక్టోబర్ 2023లో కుమారుడికి జన్మనిచ్చారు. అతనికి విలియం అలెగ్జాండర్ అని పేరు పెట్టారు. గతేడాది ఈ జంట తమ ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు.

ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. ఆస్కా గోరాడియా హిందీలో 'కుసుమ్', 'లాగీ తుఝ్సే లగన్', 'నాగిన్' వంటి సీరియల్స్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement