ఆలయాల్లో పునఃదర్శనం | alampur temple reopens after super blue moon | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో పునఃదర్శనం

Feb 2 2018 4:41 PM | Updated on Feb 2 2018 5:36 PM

alampur temple reopens after super blue moon - Sakshi

జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రతిమలకు జలాభిషేకం చేస్తున్న శివస్వాములు  

అలంపూర్‌ రూరల్‌ : జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో గురువారం ఉదయం భక్తులను దర్శనానికి అనుమతించారు. బుధవారం సాయంత్రం చంద్రగ్రహణం ఉండడంతో అర్చకులు ఆలయాలను మూసి ఉంచారు. గురువారం ఉదయం 5:30 గంటల నుంచి ఆలయ శుద్ధి చేపట్టారు. ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం 10గంటల తర్వాత భక్తులను అనుమతించారు. నాగకన్యల బావి నుంచి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర సేవాసమితి అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో శివస్వాములు 108 బిందెలతో ఇటీవల ప్రతిష్టించిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి నమూన విగ్రహాలను అభిషేకించారు. ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్‌శర్మ, వనం శ్రీకాంత్‌ శర్మ, జానకిరామ శర్మ, శ్రీనివాస శర్మ , ధనుంజయ శర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీను, శేఖర్‌ పాల్గొన్నారు.                 
                     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement