207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!

50 Revenue Officials Caught In ACB Raids Across Telangana In 2 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసుతో రెవెన్యూ యంత్రాంగంపై అందరి దృష్టి పడింది. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోతానేమోనన్న భయంతోనే విజయారెడ్డిని హత్యచేసినట్టు సురేశ్‌ మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా పనులు చేయకుండా రెవెన్యూ అధికారులు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారని  రైతులు ఆరోపిస్తున్నారు.
(చదవండి : అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం)

లంచం లేనిదే రెవెన్యూశాఖలో ఫైలు కదలదన్న తీరుగా పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అవినీతి అధికారుల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గత రెండేళ్లలో 207 ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కితే వారిలో 50 మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఇక ఎవరికీ దొరకని అవినీతి అధికారులు నేటికీ దొరలుగానే చలామణి అవుతున్నారు..!
(చదవండి : విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్‌ మృతి)

అవినీతి రెవెన్యూ అధికారుల్లో కొందరు..

  • రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య , వీఆర్వో అనంతయ్య
  • రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి
  • రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ రవిరాజా కుమార్‌రావు,వీఆర్ఏ రామకృష్ణ 
  • రూ. లక్షా 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ జిల్లా మద్దివంచ వీఆర్వో సీరం శివరావు
  • రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా కొత్తకోట  ఆర్దీఓ చంద్రా రెడ్డి, తహసీల్దార్ మల్లికార్జునరావు
  • రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మంచిర్యాల ఆర్డీవో గూడెం మనోహర్‌రావు
  • రూ.42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదాద్రి జిల్లా సుద్దాల వీఆర్వో శ్రీనివాస్ 
  • రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన నిజామాబాద్ ఆర్మూర్ ఆర్దీఓ శ్రీనివాస్
  • రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల సర్వేయర్‌ రాజు 
  • లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతిజిల్లా సర్వేయర్‌ రవి కుమార్

అవినీతి అధికారుల చిట్టా కోసం క్లిక్‌ చేయడం :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top