రైతుల ఆందోళన.. ఆర్మూర్ లో 144 సెక్షన్

సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్ లో రైతులు తలపెట్టిన రిలే దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మద్దతు ధర కోసం ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రైతుల ఆందోళనతో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 48 గంటల పాటు 144 సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది రైతులు గుమిగుడితే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 144 సెక్షన్‌ నేపథ్యంలో దాదాపు 250 మంది పోలీసులు ఆర్మూర్‌లో మోహరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top