రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి | Three people killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ముగ్గురి మృతి

Dec 19 2014 10:20 PM | Updated on Apr 3 2019 7:53 PM

పుణే సమీపంలోని కాత్రాజ్ ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

సాక్షి, ముంబై: పుణే సమీపంలోని కాత్రాజ్ ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులుండగా ఒక మహిళ ఉంది. అదేవిధంగా గాయపడ్డ వారిలో ఇద్దరు మహిళలుండగా ఒక పురుషుడున్నారు. సతారా నుంచి పునే దిశగా వస్తున్న కంటైనర్‌ను వెనక నుంచి వేగంగా దూసుకు వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. కంటైనర్ కింది భాగంలోకి కారు చొరబడడంతో అందులో వీరంతా ఇరుక్కుపోయారు. స్థానికులు పరుగునవచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అప్పటికే డ్రైవర్ సహా ముగ్గురు చనిపోయారు. గాయపడ్డ వారిని కాత్రజ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement