తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు | Telangana CM KCR to donate gold worth Rs 5.5 crore to Tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు

Feb 20 2017 2:55 PM | Updated on Aug 28 2018 5:48 PM

తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు - Sakshi

తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.

తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంగళవారం కేసీఆర్‌ తిరుమలకు వెళ్లనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి మార్గంలో తిరుపతి వరకు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ రోడ్డు పక్కన భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేరుతో ఈ పోస్టర్లు ఏర్పాటయ్యాయి.
 
రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని  మొక్కులు చెల్లించుకుంటారు . ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేయనున్నారు.
 
అదేవిధంగా 22వ తేదీన తిరుపతిలో జరుగనున్న తెలంగాణ సివిల్‌ సప్లయ్ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేటీఆర్‌, కవిత కుటుంబ సభ్యులు, మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ఐకే రెడ్డి  తదితరులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement