ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన హిజ్రా ప్రితికా యాషిన్‌ | Taking office hijra Pritika Yashini | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన హిజ్రా ప్రితికా యాషిన్‌

Apr 4 2017 2:16 AM | Updated on Sep 2 2018 5:04 PM

ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన హిజ్రా ప్రితికా యాషిన్‌ - Sakshi

ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన హిజ్రా ప్రితికా యాషిన్‌

దేశంలోనే మొట్టమొదటి హిజ్రా ఎస్‌ఐగా ప్రితికా యాషిన్‌ బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడులోని సేలం కందంపట్టికి చెందిన కళైయరసన్‌ లారీ డ్రైవర్‌. అతని భార్య సుమతి.

కేకేనగర్‌ : దేశంలోనే మొట్టమొదటి హిజ్రా ఎస్‌ఐగా ప్రితికా యాషిన్‌ బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడులోని సేలం కందంపట్టికి చెందిన కళైయరసన్‌ లారీ డ్రైవర్‌. అతని భార్య సుమతి. ఈ దంపతుల కుమారుడు రాహుల్‌ కుమార్‌. ఇతడు హిజ్రాగా మారి ప్రితికా యాషిన్‌ (26)గా పేరు మార్చుకున్నాడు. ప్రితికా సేలం ప్రభుత్వ కళాశాలలో బీసీఏ చదివి 2016న పోలీసు ఎంపికలో ఎస్‌ఐ పరీక్ష రాసి యాషిన్‌ ఉత్తీర్ణత సాధించారు. అనంతరం చెన్నైలో ఏడాది కాలం శిక్షణ పూర్తి అయిన క్రమంలో ధర్మపురి జిల్లాలో పోస్టింగ్‌ కేటాయించారు. ధర్మపురి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ శంకర్‌ నుంచి నియామక ఆదేశాలతోపాటు అభినందనలు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement