సమంత చేతికి సూర్య చిత్రం | Surya new movie Telugu release rights Samantha | Sakshi
Sakshi News home page

సమంత చేతికి సూర్య చిత్రం

Sep 25 2015 2:57 AM | Updated on Sep 3 2017 9:54 AM

సమంత చేతికి సూర్య చిత్రం

సమంత చేతికి సూర్య చిత్రం

సాధారణంగా సినిమాలో సంపాదించిన డబ్బును ఇదే రంగంలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు రారు. నటుడు కమలహాసన్ లాంటి అతి కొద్దిమందే

 సాధారణంగా సినిమాలో సంపాదించిన డబ్బును ఇదే రంగంలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు రారు. నటుడు కమలహాసన్ లాంటి అతి కొద్దిమందే తమ సంపాదనను మళ్లీ సినిమాలోనే పెడుతుంటారు. మరి కొందరు హీరోలైతే చిత్రానికి పారితోషికం బదులు ఏరియా హక్కులను పొంది భారీ మొత్తాన్ని పొందుతుంటారు. ఇక కథానాయికల విషయానికొస్తే సినిమాల్లో సంపాదించిన డబ్బును వేరే రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటిది నటి సమంత తాను సంపాదించిన డబ్బును సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవ్వడం విశేషం.
 
  సమంత ప్రస్తుతం నెంబర్‌వన్ రేసులో ఉన్న హీరోయిన్. ఆమె చేతిలో పలు భారీ చిత్రాలు ఉన్నాయి. విక్రమ్‌తో నటించిన 10 ఎండ్రదుకుళ్ చిత్రంలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా విజయ్, ధనుష్, సూర్యల సరసన నటిస్తున్నారు. కాగా సూర్యతో నటిస్తున్న భారీ చిత్రం 24కు ప్రముఖ మలయాళి దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అంజాన్ చిత్రం తరువాత సమంత, సూర్యతో నటిస్తున్న చిత్రం 24. ఈ చిత్రంతో సమంత కొత్త అవతారమెత్తుతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులను ఈ చెన్నై చిన్నది సొంతం చేసుకున్నారన్నది కోలీవుడ్ వర్గాల టాక్.
 
  సూర్య చిత్రాలకు తమిళంతో పాటు తెలుగులోను మంచి వ్యాపారం ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రంలో సమంతకు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర అట. ఈ లెక్కలన్నీ కూడి 24 చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే దీన్ని తెలుగులో ఆమె సొంతంగా విడుదల చేయకుండా ఎవరికైనా చేయి మార్చే ఆలోచనలో ఉన్నారట. మొత్తం మీద ఈ కొత్త ప్రయత్నంలో సమంత ఎలాంటి అనుభవాన్ని చవి చూస్తారో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement